calender_icon.png 31 January, 2026 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమం

30-01-2026 09:01:16 PM

కొండపాక,(విజయక్రాంతి): దుద్దెడ గ్రామపంచాయతీలో స్పర్శ లేప్రసి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి ధనరాజ్ ఆదేశాల మేరకు  నిర్వహించారు. జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో జిల్లా వైద్య అధికారి ధనరాజ్ ఆదేశాల మేరకు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో స్పర్శ లేప్రసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా లేప్రాసి ప్రోగ్రాం అధికారిని డాక్టర్ నిర్మలారెడ్డి మాట్లాడుతూ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు అన్ని గ్రామాలలో కుష్టివ్యాధి పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు లేప్రసి వలన వచ్చే వ్యాధి కాదని ఇది ఒక మైక్రో బాక్టీరియం లేప్రో అనేటువంటి సూక్ష్మ క్రిమి నుంచి వచ్చే అతి సాధారణమైనటువంటి అంటూ వ్యాధి అని ఇది ఎం డి టి చికిత్స ద్వారా పూర్తిగా నయమవుతుందని ఎలాంటి అపోహాలకు గురి కావద్దని అన్నారు.

ఈ వ్యాధి లక్షణాలు శరీరంపై రాగి వర్ణపు మచ్చలు, స్పర్శ లేకపోవడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు మొద్దు బారినట్లు ఉండడం, పట్టుత్వం కోల్పోయినట్లు అనిపించడం, మోకాళ్లపై బొడిపెలు రావడం, దీర్ఘకాలిక పుండ్లు, కనుబొమ్మలు రాలిపోవడం, కళ్ళు ఎర్రబారడం, ముక్కు నుండి రక్తం కారణం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఆరోగ్య కార్యకర్తలను, ఆశా కార్యకర్తలను సంప్రదించి వ్యాధిని నిర్ధారించుకొని పూర్తి చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించారు.

ఈ వ్యాధికి గురై అంగవైకల్యం బారిన పడినటువంటి వ్యక్తుల పట్ల ఆధార అభిమానాలను చూపాలని ఎలాంటి వివక్షతను ప్రదర్శించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి, మండల వైద్య అధికారి శ్రీధర్, డిపిఎంఓ లు లక్ష్మణ్, జయకర్, రవీందర్, జయమ్మ, పాలకవర్గం, స్థానిక ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎమ్ లు ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.