09-01-2026 10:14:26 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఐనవోలు జాతరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేసి జాతరను విజయవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఈనెల 13 నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దేవాదాయ, పంచాయతీ రాజ్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేసిన జాతర ఏర్పాట్లు వాటి పురోగతి గురించి సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులుకు ఎక్కడ కూడా ఇబ్బందులకు కలగకుండా అధికారులు సమన్వయంతో జాతరలో సేవలందించాలని తెలిపారు. ముందుగా ఆలయానికి వచ్చిన కలెక్టర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు శేషవస్తాలను అందించి ఆశీర్వాచనం చేసి తీర్థప్రసాదలను అందజేశారు.