31-07-2024 01:04:59 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సెక్రటేరియట్ కు వెళ్లారు. తన ఛాంబర్ లో రెన్నోవేషన్ పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్షించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ పవన్ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.