అభివృద్ధి పనులకు సబిత శంకుస్థాపన
బడంగ్‌పేట్, ఆగస్టు 24 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం జిహెచ్‌ఎంసి బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీలలో రూ.65 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి కా లనీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష ్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపా రు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప థంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఏజీఆర్ కాలనీలో రూ.36 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. అదే విధంగా నాదర్ గుల్ శాంతినగర్‌లో రూ.16 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం, గుర్రం గూడ జీబీఆర్ కాలనీలో రూ.13 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో పలువురు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






