త్యాగశీలి.. గొప్ప దేశభక్తుడు రాజీవ్‌గాంధీ
l పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): త్యాగశీలి, గొప్ప దేశభక్తుడు రాజీవ్‌గాంధీ అని, ఆయన ప్రధానిలా కాకుండా ఉద్యోగిలా దేశ భవిష్యత్తు కోసం పనిచేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు గాంధీ కుటుంబంపై విమర్శించేందు ముందు వారి త్యాగనిరతిని తెలుసుకోవాలని హితవు పలికారు. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కృషితో దేశంలో టెలీ కమ్యూనికేషన్స్, నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటిక్ సిటీకి పునాది వేశారని గుర్తుచేశారు.
రాజీవ్‌గాంధీ తెచ్చిన టెక్నాలజీనే ఇప్పుడు మోదీ నుంచి కేసీఆర్, కవిత వరకు వాడుతున్నారన్నారు. దేశానికి శాంతి సందేశం ఇచ్చింది, శ్రీలంకపై ఎల్టీటీ దాడులను అడ్డుకుందని రాజీవ్‌గాంధీనే అని గుర్తుచేశారు. గాంధీ కుటుంబం బలిదానాల కుటుంబమని, బీజేపీ నేతలకు ఇలాంటి చరిత్ర ఉందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు తండ్రి ఆశయాల కోసం రాహుల్‌గాంధీ పని చేస్తున్నారన్నారు.






