18-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, జులై 17: ఇంటింటికి రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట రెయిన్బో మెడోస్ కాలనీలో మంచినీటి నల్ల కనెక్షన్లను గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు. అనంతరం ఐలాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన గ్రామాలలో గల కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. మంచినీటి సమస్య పరిష్కారానికి అమీన్ పూర్ పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేసి పంపిణీ కూడా ప్రారంభిచినట్లు తెలిపారు.
విలీన గ్రామాల పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ, శ్రీకాంత్, గోవింద్, కాలనీ అధ్యక్షులు జీవన్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.