calender_icon.png 18 July, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఏరియా లో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

18-07-2025 08:12:23 AM

ఇల్లందు టౌన్,  (విజయక్రాంతి): సింగరేణి  ఇల్లందు ఏరియాలో సింగరేణి డైరెక్టర్(Singareni director) కే. వెంకటేశ్వర్లు ఇల్లందు ఏరియా లోని కోయగూడెం ఓ.సీ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.యం వి.కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డైరెక్టర్ (పి.పి) కే.వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ వర్షాకాలంలో ఎదురైయ్యే సమస్యలను గురించి అధికారులకు తగు సూచనలు చేశారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించి రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, అలాగే బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జి.13 బొగ్గు ఉత్పతి అయ్యేలా చూడాలని, ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయాలని అన్నారు.

అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయములో ఉన్నత అధికారాలతో సమావేశం లో పాల్గొన్నారు. నూతన జే కే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను పరిశీలించి రివ్యూ చేపట్టారు. నూతన ఓసి కి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి బొగ్గు రవాణా జరిగేటట్లు చూడాలని ఏరియా జీఎంకు తెలిపారు. ఈ కార్యక్రమం లో జి.యం ఎస్టేట్ రాధాకృష్ణ, ఎస్ ఓ టు జీఎం రామస్వామి,  ఏ.జి.ఎం(ఐ.డి) యం.గిరిధరరావు, కోయగూడెం పి.ఓ గోవింద రావు, ఏరియా ఇంజనీర్ నరసింహ రాజు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్, డిజియం (సివిల్)రవి కుమార్, డిజియం (ఏరియా వర్క్ షాప్) నాగరాజు నాయక్,  ఏరియా సర్వే ఆఫీస్ రాం మూర్తి,  ఎస్టేట్ మేనేజర్ శివ వీర కుమార్,  మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు అని ఇంచార్జ్ అధికార ప్రతినిధి బి.శ్యామ్ ప్రసాద్ అన్నారు.