calender_icon.png 24 May, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా విద్యాభివృద్ధిలో కలెక్టర్ కృషి అనిర్వచనియం

23-05-2025 10:49:11 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా విద్యారంగంలో తనదైన శైలిలో వినూత్న పథకాలను పరిచయం చేస్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు ఆదర్శప్రాయలు అనే పుస్తకాన్ని కొత్తగూడెం మండల విద్యాధికారి డాక్టర్ ప్రభుదాయాల్ శుక్రవారం అందజేశారు. విద్యాభివృద్ధికి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతగా  1932లో రాజమండ్రిలో స్థాపించబడి ఆనాడు మహాత్మా గాంధీ దర్శించిన రత్నం అండ్ కంపెనీ తయారు చేసిన ప్రత్యేక సాంప్రదాయ సిరా పెన్నును కలెక్టర్ కు అందజేశారు.

అందరు ప్రాథమిక విద్యార్థులకు ప్రత్యేక నోట్సులు, ప్రత్యేక వేసవి తరగతులు, పాఠశాలలో ఉపయోగకర మొక్కల పెంపకం, వర్షపు నీటి సంరక్షణకై ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతల నిర్మాణం,ఆయా పాఠశాలలో చదువుతున్న బీద విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహాలు, రుద్రంపూర్ ప్రభుత్వ ఐటీఐలో ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పూర్తి స్టడీ మెటీరియల్ అందేలా కృషి చేశారు, అన్ని పాఠశాలలకు క్రీడా సామాగ్రి ఏర్పాటు , ఇలా పలు వినూత్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను పాఠశాలల్లో ప్రవేశపెట్టి, జిల్లా విద్యాభివృద్ధికి కృషి చేయడం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో  జిల్లాకు ప్రత్యేక గుర్తింపును జిల్లా కలెక్టర్ సాధించారు.