calender_icon.png 24 May, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి

21-05-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, మే 20 :  పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా తీసుకున్న గోపాల్పేట మండలంలోని భూ భారతి దరఖాస్తులను జూన్ 2 లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై సమీక్ష నిర్వహించారు.

వనపర్తి జిల్లాలో భూ భారతి చట్టం అమలును గోపాల్ పేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టు గా తీసుకొని మే 5 నుండి 13 వరకు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోగా మొత్తం 573 దరఖాసులు వచ్చాయి. అందులో 155 సెక్సేషన్, 131 సాదా బైనామా, పెండింగ్ మ్యుటేషన్, అసైన్మెంట్ మొదలగు దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ జూన్ 2 లోగా పరిష్కరించాల్సి ఉందన్నారు. 

తహసిల్దార్ లాగిన్ లో పరిష్కారం అయ్యే వాటిని త్వరగా పరిష్కరించి ఆర్డీఓ లాగిన్ కు సంబంధించి, కలెక్టర్ ద్వారా పరిష్కరించాల్సినవి  కలెక్టర్ లాగిన్ కు పంపించాలని తహశీల్దార్లు ఆదేశించారు. జూన్ 2 నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో భూ భారతి చట్టం అమలు చేసేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉంటుందని అందుకు తగిన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, గోపాల్పేట్ తహసిల్దార్ పాండు నాయక్, రాజు  సెక్షన్ సూపరిండెంట్ మదన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.