15 April, 2026 | 11:08 AM

దేశమా నీకు వందనం

25-01-2026 12:00 AM

దేశమా నీకు ఇదే మా వందనం

గణతంత్రమా నీకు ఇదే మా ఘనస్వాగతం

ఈ దేశం నాది ఈ రాజ్యం నాది అని 

ప్రతి పౌరుడికి ఉండాలి

ప్రతి పౌరుడు సైనికుడిలా పోరాడాలి!!


మూడు రంగుల జెండా మురిసిపోవాలి

భారతీయులంతా కలసి రావాలి

గణతంత్ర దినోత్సవ సంబరాలలో

మన దేశ ఖ్యాతి దిగంతాలు దాటాలే!!


నాటి నేతల స్ఫూర్తిని పునికి పుచ్చుకోవాలి

అభివృద్ధి బాటలో అడుగులు వేయాలి

భారతావని గుండెల్లో వెలుగులు నింపాలి

విజ్ఞాన గనిగా నింగిని అంటాలి 

నా భారతదేశం!!

 దేవులపల్లిరమేశ్, సిద్దిపేట