calender_icon.png 14 August, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరినీ గౌరవించడమే సనాతన ధర్మం

12-08-2024 04:30:00 AM

  1. భక్తి శ్రద్ధలతో విద్యాకోటి కుంకుమార్చన 
  2. స్కందగిరి మఠంలో ప్రారంభమైన మహాయజ్ఞం
  3. స్వామి అభిషేక్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో నేడు, రేపు పూజలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి):  ప్రతి ఒక్కరిని గౌరవించడమే సనాతన ధర్మమని స్వామి అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్ (వారణాసి) బోధించారు. లోక కల్యాణం కోసం  స్వామి అభిషేక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవిద్యాకోటి కుంకు మార్చన ఆదివారం ఉదయం ప్రారంభమైంది.

సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని శ్రీకంచి కామకోటి పీఠంలో జరిగిన ఈ యజ్ఞంలో భక్తిశ్రద్ధలతో మహిళలు, భక్తులు భారీఎత్తున పాల్గొన్నారు. ఆదివారం ఉద యం గణపతి పూజతో మహాయజ్ఞం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగింది. అంబిక, వరుణపూజ, మాతృకపూజ, గురుపాదుక పూజ, గణపతి సహస్రార్చన క్రతువులు జరిగాయి. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రాజేశ్వర్‌రావు, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, ప్రొఫెసర్ అనంతలక్ష్మి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా స్వామి అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్ మాట్లాడుతూ.. అన్యాయం, అవినీతిపై పోరాడాలని సనాతన ధర్మం నేర్పుతోందన్నారు. భారత్‌వైపు ప్రపంచం చూస్తోందని, ఇది రాజకీయాలకు సమయం కాదని, సేవ చేయాల్సిన అవసరముందని చెప్పారు. ప్రపంచశాంతి కోసం లలితాదేవిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి మందిరాన్ని చూడడం ప్రతి సనాతనవాది గర్వించదగ్గ విషయమన్నారు. 

యువచేతన జాతీయ కన్వీనర్ రోహిత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ 2047 నాటికి దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయా ల్సిన అవసరం ఉందన్నారు. లలితామాత ఆశీస్సులు, ప్రజల కృషితో దేశ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పీ నవీన్‌రావు, సుధాకర్‌శర్మ, జయపాల్‌సింగ్‌నాయల్, రోహిత్‌చౌదరి, కే హరినాథ్, కృష్ణన్‌రాజమణి, సౌరభ్‌సింగ్, ఫణిభూషన్, అర్పిత, లోకావాణి, ఎం స్వప్న, శివస్రసాద్, కరాటే కల్యాణి, బీ రవి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా కారులు భరతనాట్యం, భాగవత కాలక్షేపం, హరికథ, దేవీభాగవతాన్ని ప్రదర్శించారు. 

మంగళవారం పూర్ణాహుతి 

రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటలు, మళ్లీ సాయం త్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు వెయ్యిమంది మహిళలు పూజలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపా రు. స్వామి అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన కుంకుమార్చన మహాయజ్ఞం సోమవారం కూడా కొనసాగనుంది. మంగళ వారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా మధ్యా హ్నం, రాత్రి అన్నప్రసాదాల వితరణ చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.