calender_icon.png 16 August, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాలో అతి తెలివి..ఏకంగా ఆ కూరే వండి పెట్టాడు

12-08-2024 11:34:37 AM

సోషల్ మీడియాలో అతితెలివి వెర్రి తలలు వేస్తోంది... కనీసం తాము ఎలాంటి కేసులలో ఇరుక్కునే అవకాశం ఉంది.. తదనంతరం ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి అని ఆలోచించటం లేదు.   అందరూ..చికెన్ కర్రీ, కోడి కూరను వండి పోస్ట్ చేస్తే  ఏం మజా ఉంటుంది అనుకున్నాడేమో.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్ కుమార్ చికెన్ కర్రీ వండి నెమలి ఫోటో తను పట్టు కన్నట్లు గ్రాఫిక్స్ ను సైతం తయారు చేసి నెమలికూర సంప్రదాయ పద్ధతిలో  ఎలా వండాలో అంటూ వంటకాన్ని మంచి ఫోటో, వీడియోలతో  అప్లోడ్ చేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి వ్యతిరేక కామెంట్లు రావడంతో వెంటనే డిలీట్ చేశాడు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కోడి ఈకలు, చికెన్ కూరను స్వాధీనపరచుకున్నామని, వాటిని డీఎన్ఏ పరీక్షకు పంపించామన్నారు. నెమలి అయితే అటవీశాఖ చట్ట ప్రకారం కేసు, నెమలి కాకపోతే  సోషల్ మీడియాలో తప్పడు ప్రచారం  చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు అప్పగిస్తామని సిరిసిల్ల జిల్లా అటవీశాఖ అధికారి కల్పనా దేవి వివరించారు.