calender_icon.png 27 October, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన హిందూ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి

22-09-2024 05:51:55 PM

జనసేన ఉమ్మడి జిల్లా విద్యార్ది విభాగం అధ్యక్షుడు ఆవుల సాగర్

మందమర్రి,(విజయక్రాంతి): సనాతన హిందూ ధర్మంపై పదేపదే జరుగుతున్న దాడులను అరికట్టేందుకు వెంటనే దేశ వ్యాప్తంగా సనాతన హిందూ బోర్డును ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆవుల సాగర్ డిమాండ్ చేశారు. ఆదివారం  ఆవుల సాగర్ విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ఎంతో పవిత్రమైనదని,పవిత్రమైన లడ్డుని  అపవిత్రం చేసినవారు ఎంతటి వారైనా దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని భక్తుల మనోభావాలు గౌరవించాలని ఆయన   కోరారు.హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దేవాలయాలపై దాడులను చేసే వారిని దేశ వ్యాప్తంగా అరి కట్టాలంటే ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కోరిన విధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సనాతన హిందూ బోర్డును వెంటనే  ఏర్పాటు చేయాలని ఆవుల సాగర్ డిమాండ్ చేశారు. హిందూ ధర్మంపై జరిగే దాడులపై సెక్యులర్ వాదులు మౌనం వీడాలని ఆయన సూచించారు.