calender_icon.png 14 October, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం

14-10-2025 07:07:44 PM

పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే జిల్లా అధ్యక్షుడు ఎన్నిక..

ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎన్నిక కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంపిక చేయడం కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్ అన్నారు. మంగళవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం భార్గవ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు స్వీకరించి డిసిసి అధ్యక్షుడును ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అబ్జర్వర్ ఎమ్మెల్యే  శంకర్, డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్, ఎండి అవేజ్ ,ఇందిరా రావు, డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, జిల్లా నాయకులు నూకల అభినవరెడ్డి, యుగేందర్ రెడ్డి,ఏడు మండలలా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.