14-10-2025 07:09:20 PM
కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ
కోదాడ; నిరుద్యోగులకు ఉపాధి కల్పన అందించే విధంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో ఈనెల 25న హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో వివిధ రకాల ఫార్మసీ కంపెనీలు, టెక్ కంపెనీలు పాల్గొంటారని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉపయోగించుకోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని నిరుద్యోగులను కోరినారు.