calender_icon.png 14 October, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

14-10-2025 07:06:05 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని రామ లక్ష్మి పురం గ్రామానికి చెందిన బుడిగ వీరబాబు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని గురుకుల స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా కలెక్టర్ నుండి అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వీరబాబు పుష్యవతి దంపతులకు మంగళవారం స్వగ్రామం రామలక్ష్మి పురంలో రామాలయంలో దేవాలయ వైస్ చైర్మన్ అన్న నరసింహారెడ్డి స్రవంతి దంపతులు, చైర్మన్ సుబ్బారెడ్డి పద్మ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.

కార్యక్రమంలో మాజీ సర్పంచులు కన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి బ్రహ్మం కౌలు రైతు సంఘంరాష్ట్ర ఉపాధ్యక్షులు పాపిరెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుభాష్ రెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్ కోటిరెడ్డి పడగరాయ గుట్ట దేవాలయం చైర్మన్ కృష్ణారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి సీనియర్ నాయకుడులక్ష్మారెడ్డి యుతు అధ్యక్షుడు వెంకట్ రెడ్డి శంభో రాణి సంజీవరెడ్డి పార్వత చారి చెవిరెడ్డి కృష్ణారెడ్డి భాస్కర్ అంజిరెడ్డినరేష్ రెడ్డి సంజితురెడ్డి కామేశ్వరమ్మ మాధవి నాగలక్ష్మి భాస్కరరావు పార్వతమ్మ వెంకటరెడ్డి లింగయ్య పాల్గొన్నారు.