calender_icon.png 28 July, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెరబస్త్తీలో శానిటేషన్ డ్రైవ్

25-07-2025 02:22:40 AM

ఎల్బీనగర్, జులై 24 : లింగోజిగూడ డివిజన్ లోని వడ్డెర బస్తీలో గురువారం జీహెచ్‌ఎంసీ అధికారులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ ఆటో టిప్పర్ వాహనాల డ్రైవర్లు వడ్డెర బస్తిలో ఇంటింటికీ తిరుగుతూ చెత్తను తొలి గించి, స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను రో డ్డుపై వేస్తే అనేక రోగాలు వస్తాయని,

ప్రతి ఒక్కరూ చెత్తను ఆటోకు ఇవ్వాలని సూచించారు. రోడ్డుపై చెత్త వేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయాని తెలిపారు. రోడ్డుపై చెత్త వేస్తే ఖచ్చితంగా ఫైన్ విధిస్తాం, కరెంట్ కూడా కట్ చేస్తాం అని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డి ప్యూటీ కమిషనర్ మల్లికార్జున్, ఏహెచ్ ఎంవో నగేశ్ నాయక్, నాయకులు శ్రీధర్ గౌడ్, శ్రవణ్ గుప్తా, ప్రవీణ్ రెడ్డి, జూపల్లి ప్రవీణ్, అనసూయ, కాలనీ సభ్యులు ప్రభాకర్, వెంకట్, రాజు, కృష్ణ శానిటేషన్ జవాన్ తదితరులు పాల్గొన్నారు.