25-07-2025 02:22:45 AM
5కే రన్‌లో పాల్గొన్న అబ్దుల్లా
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మార్రీ గురువారం హైదరాబాద్‌లో పర్యటించారు. పర్యటనలో భా గంగా.. తెలంగాణ క్రీడా శాఖ దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన 5కే రన్‌లో తెలంగాణ క్రీడా సంస్థ అధికారులతో కలిసి ఆయన ఉత్సాహంగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఆతిథ్యానికి ప్ర సిద్ధిగాంచిన నగరంగా అభివర్ణించారు.
తెలంగాణ క్రీడా శాఖ రాష్ర్టంలో వివిధ క్రీడా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రశంసలు కురిపించారు. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. ఈ పర్యటన ఇరు దేశా ల మధ్య క్రీడా, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని చె ప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి , పారాలింపియన్ దీప్తి జీవన్ జీ, ఆసియా అథ్లెటిక్స్ స్వర్ణ పతక విజేత నందినీ పాల్గొన్నారు.