calender_icon.png 31 July, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యం మెరుగుపరచాలి

30-07-2025 11:14:00 PM

ఎంపీడీవో రాజేశ్వర్..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరచాలని ఎంపీడిఓ ఎన్ రాజేశ్వర్(MPDO Rajeshwar) గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీలో పారిశుధ్య చర్యలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామస్తులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా వర్షం నీరు, డ్రైనేజీ నీరు నిలవ కుండా చూడాలన్నారు. పారిశుద్ధ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు.  గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

ఇందిరమ్మ లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకుని సొంతింటి కళను సాకారం చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామం లోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కొండ్రు ప్రశాంత్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్ లు పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీ పరిశీలన..

మండలంలోని సారంగపెల్లి గ్రామపంచాయతీలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పంపిణీ చేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపిడిఓ రాజేశ్వర్ పరిశీలించారు. పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు.