30-07-2025 11:07:51 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఎక్సైజ్ శాఖలో పట్టుబడ్డ వాహనాల వేలం పాటను బుధవారం మంచిర్యాల ఎక్సైజ్ సూపర్డెంట్ నందగోపాల్(Excise Superintendent Nandagopal) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపర్డెంట్ నందగోపాల్ మాట్లాడుతూ... 14 వాహనాలకు ప్రభుత్వ మద్దతు ధర 90 వేలకు గాను ఎక్సైజ్ వేలంలో ముప్పై అయిదు వేల రూపాయలు అధికంగా పాట పాడి ఒక లక్ష ఈరవై ఐదు వేలకు 14 వాహనాలు వేలం పాట పాడి తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సమ్మయ్య, ఎస్ఐ మౌనిక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.