calender_icon.png 16 November, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నైకి సంజూ శాంసన్.. రాజస్థాన్‌కు జడేజా, సామ్ కరన్

16-11-2025 12:00:00 AM

-ఐపీఎల్ మెగా ట్రేడింగ్ డీల్

-స్టార్ ప్లేయర్స్‌కు ఫ్రాంచైజీల షాక్

-రిటెన్షన్ జాబితా విడుదల

ముంబై, నవంబర్ 15 : ఐపీఎల్ మినీవేలానికి ముందు ట్రేడింగ్ విండో ముగిసింది. ఊహించినట్టుగానే లీగ్ చరిత్రలో మరో హిస్టారికల్ డీల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జ డేజా రాజస్థాన్‌కు వెళ్లిపోయాడు. జడేజాతో పాటు సామ్ కరన్‌ను ఇచ్చేసిన సీఎస్కే ఫ్రాం చైజీ సంజూ శాంసన్‌ను తీసుకుంది.

అలాగే సామ్ కరన్‌ను రాయల్స్ రూ.2.4 కోట్లకు ట్రేడ్ చేసుకుంది. అలాగే ట్రేడింగ్‌లో సన్‌రైజర్స్ పేసర్ మహ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇచ్చేసింది. మరోవైపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిలీజ్, రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాలను ప్రకటించాయి. అందరూ అనుకున్నట్టుగానే గత సీజన్‌లో నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్‌కు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. మాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్, ఆండ్రూ రస్సెల్, హసరంగ,పతిరణ వంటి విదేశీ స్టార్స్‌తో పాటు  వెంకటేశ్ అయ్యర్ వంటి స్వదేశీ ప్లే యర్స్‌ను వేలంలోకి వదిలేసాయి.  

ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్స్ :

చెన్నై : పతిరన, త్రిపాఠీ, వన్డ్ బేడి, సిద్ధార్థ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శం కర్, షేక్ రషీద్, కమలేశ్ నాగర్‌కోటి

ముంబై : సత్యనారాణయ రాజు, టాప్లీ, షీర్జీత్, కరణ్ శర్మ, బెవాన్ జాకబ్స్, ముజీబు ర్, లిజాడ్ విలియన్స్, విజ్ఞేశ్ పుతుర్

హైదరాబాద్ : అభినవ్ మనోహర్, అథర్వ తైడే, సచిన్ బేబి, వియాన్ ముల్దర్, సిమర్‌జీత్‌సింగ్, రాహుల్ చాహర్, జంపా

బెంగళూరు : స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, సిఫర్ట్, లివింగ్‌స్టోన్, మనోజ్ భాడ్గే, ఎంగిడి, ముజారబానీ, మోహిత్ రాథీ

పంజాబ్ : జోస్ ఇంగ్లీస్, ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, మాక్స్‌వెల్, ప్రవీణ్ దూబే

ఢిల్లీ : డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, సెథిఖుల్లా, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ

గుజరాత్ : మహిపాల్ లామ్రోర్, కరీమ్ జనత్, శనక, కొయెట్జీ, కుజ్రోలియా

లక్నో : ఆర్యన్ జుయల్, మిల్లర్, యువరాజ్ చౌదరి, హంగర్గేకర్, ఆకాశ్ దీప్, రవి బిష్ణోయ్, షుమర్ జోసెఫ్

రాజస్థాన్ : హసరంగ, తీక్షణ, ఫజల్ హక్ ఫారూఖీ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, కునాల్ రాథోడ్, అశోక్ వర్మ

కోల్‌కత్తా : రస్సెల్ , వెంకటేశ్ అయ్యర్, డికాక్, నోకియా, మొయిన్ అలీ , స్పెన్సర్ జాన్సన్, సిసోడియా, చేతన్ సకారియా, గుర్బాజ్