16-11-2025 12:00:00 AM
-మెడనొప్పితో హాస్పిటల్‌కు భారత కెప్టెన్
-రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అనుమానమే
కోల్‌కత్తా, నవంబర్ 15 : సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ రెండోరోజు ఆటలో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభమన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్ రెండో బంతిని ఫోర్ కొట్టినా మెడ వెనుక భాగంలో తీవ్రనొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి పరిశీలించిన తర్వాత గిల్ మైదానాన్ని వీడి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
9 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా గిల్ బ్యాటింగ్‌కు రాలేకపోవడంతో భారత్ ఆలౌట్ అయింది.. ఆట ముగిసిన తర్వాత స్కానింగ్ కోసం గిల్ ను హాస్పిటల్‌కు తరలించినట్టు టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. టెస్ట్ జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ గిల్ వర్క్‌లోడ్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది.
అన్ని ఫార్మాట్లలోనూ అతను కీలక ప్లేయర్ కావడంతో విశ్రాంతి లేకుండా వరుసగా సిరీస్‌లు ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల తర్వాత ఆసియాకప్, విండీస్‌తో రెండు టెస్టు లు, ఆసీస్ టూర్‌లో మూడు వన్డేలు, ఐదు టీట్వంటీలు ఆడి రెస్ట్ కూడా తీసుకోలేదు.