16-11-2025 12:00:00 AM
ఈడెన్‌లో తిప్పేసిన భారత స్పిన్నర్లు
-రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 93/7
-ఒకేరోజు నేలకూలిన 16 వికెట్లు
-త్వరగా ఆలౌట్ చేస్తే గెలుపు మనదే
కోల్‌కత్తా, నవంబర్ 15 : భారత్, సౌతాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగు తున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతానికి భారత్‌దే పైచేయిగా ఉన్నప్పటకీ సౌతాఫ్రికా విజయావకాశాలను కూడా కొట్టిపారేయలేని పరిస్థితి నెలకొంది. రెండోరోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీ ఆధిక్యం సాధిస్తుం దనుకున్న టీమిండియా 189 పరుగులకే పరిమితమైంది. గాయంతో గిల్ రిటైర్డ్ హర్ట్ కావడం దెబ్బతీసింది.
అటు 30 పరుగుల ఆధిక్యం రావడం కాస్త అడ్వాంటేజ్. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు తిప్పేయడంతో సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయింది. దీంతో ఒకేరోజు మొత్తం 16 వికెట్లు నేలకూలాయి. రెండోరోజు 37/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన కేఎల్ రాహుల్ (39), వాషింగ్టన్ సుంద ర్(29) రెండో వికెట్‌కు 57 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇక్కడ నుం చి టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది.
గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన తర్వాత పంత్, రవీంద్ర జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. స్పిన్నర్లకు అనుకూ లిస్తున్న పిచ్‌పై పరుగులు చేయడం కష్టంగా మారిం ది. జడేజా (27), పంత్ (27) ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమ యం పట్టలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 189 పరుగులకు ఆలౌటవగా.. రాహుల్ 39 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్ల లో హార్మర్ 4, జెన్సన్ 3 వికెట్లు తీశారు. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాను భారత స్పి న్నర్లు బెంబేలెత్తించారు.
ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరినీ క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. రికెల్టన్ (11), మార్క్‌క్రమ్ (4),ముల్దర్ (11), జోర్జి(2). స్టబ్స్(5), వెరిన్నే(9) పరుగులకే ఔటయ్యారు. ముఖ్యంగా జడేజా తన స్పిన్ మ్యాజిక్‌తో సఫారీ బ్యాటర్లను తిప్పేశాడు. బంతి ఎటు వస్తుందో కూడా తెలియక సౌతాఫ్రికా బ్యాట ర్లు వికెట్లు కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా తిప్పేయడంతో సౌతా ఫ్రికా రెండోరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. కెప్టెన్ బవు మా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
ఓవరాల్‌గా సౌతాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజే ఈ మ్యాచ్ ఫలితం తేలిపోనుంది. ప్రస్తుతానికి భా రత్ విజయం దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. మూ డోరోజు ఎంత త్వరగా సఫారీలను ఆలౌట్ చేస్తే భారత్‌కు అంత విజయావకాశాలుంటాయి. ఎం దుకంటే నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అంత ఈజీ కాదు. సౌతాఫ్రికా జట్టులో స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, ముత్తుసామి, హార్మర్ కూ డా ఫామ్‌లో ఉండడంతో భారత్ బ్యాటర్లు ఛేజింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. పైగా గాయపడిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వస్తాడో లేదో చూడాలి.
స్కోర్లు :
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 159 ఆలౌట్, మార్క్‌క్రమ్ 31, ముల్దర్ 24, రికెల్టన్ 23, బుమ్రా 5/27, సిరాజ్ 2/47, కుల్దీప్ 2/36)
భారత్ తొలి ఇన్నింగ్స్ : 189 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 39, వాషింగ్టన్ సుందర్ 29, పంత్ 27, జడేజా 27; హార్మర్ 4/30, జెన్సన్ 3/35)
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 93/7 ( బవుమా 29 నాటౌట్, జెన్సన్ 13, ముల్దర్ 11; జడేజా 4/29, కుల్దీప్ 2/12, అక్షర్ 1/30)