calender_icon.png 13 January, 2026 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘విజ్ఞాన్’లో సంక్రాంతి సంబురాలు

13-01-2026 02:18:07 AM

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): సంక్రాంతి అంటే రైతుల పండుగ అని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్ట ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరావు అన్నారు. సంక్రాంతి విశిష్టతను తెలిపే రంగురంగుల రంగవల్లులు, కీర్తనలు, సాంప్రదాయ వంటకాలు, పతంగి పోటీలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరావు ప్రసంగిస్తూ.. సంక్రాంతి అంటేనే రైతుల పండుగని తెలిపారు. మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. సంక్రాంతి సంబరాలతో విశ్వవిద్యాలయ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది. విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి, వాటి మధ్య గొబ్బెమ్మలు పెట్టి ప్రాంగణాన్ని అలంకరించారు. విద్యార్థులు, అధ్యాపకులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.