13-01-2026 02:16:38 AM
ఎమ్మెల్సీ శ్రవణ్
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొందరు పెద్దలు కంచె చేను మేసినట్టుగా వ్యవహరిసూ సినీ పరిశ్రమపై జులుం చేస్తూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతీ విషయంలో కమీషన్లు దండుకోవడం ప్రభుత్వా నికి పరిపాటిగా మారిందన్నారు. 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా ప్రదర్శ నలు కలెక్టర్ పరిధిలో ఉండాలని, కానీ ఈ ప్రభుత్వం ఒక్కో సినిమాకు ఒక్కో శాఖ నుంచి వేర్వేరు జీవోలు జారీ చేస్తోందన్నారు.
సినిమాటోగ్రఫీ శాఖను పక్కనబెట్టి హోం శాఖ నుంచే సినిమా టిక్కెట్ ధరల పెంపు జీవోలు రావడం అసంబద్ధమన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా తనకు తెలియకుండానే టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు అని మొన్నటి ప్రెస్ మీట్‌లో వెల్లడించారని చెప్పారు. ‘ఒక్కో హీరోకి ఒక్కో న్యాయం ఎందుకు’ అని ప్ర శ్నించారు. అసెంబ్లీలో టిక్కెట్ ధరలు పెంచనివ్వను అని ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ కమీషన్లు వచ్చాయని టిక్కెట్ ధరలు పెంచుతున్నారని నిలదీశారు.