calender_icon.png 8 January, 2026 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినుల క్రీడా అభివృద్ధికి ముందడుగు

07-01-2026 03:42:11 PM

బేగంపేట్ ఉమెన్స్ కాలేజ్‌లో సంసద్ ఖేలో మహోత్సవ్ చర్చలు

సనత్‌నగర్,(విజయక్రాంతి): కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి సూచనల మేరకు బుధవారం బేగంపేట్ ఉమెన్స్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ సుప్రియని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కాలేజ్ విద్యార్థినులు వివిధ క్రీడా టోర్నమెంట్లలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాలని ఆహ్వానం అందించడం జరిగింది. దీనికి స్పందించిన  సుప్రియ, విద్యార్థినులతో జట్లను సిద్ధం చేసి టోర్నమెంట్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.