13 August, 2026 | 4:02 AM

బోధన్ జిల్లా ఆస్పత్రికి 20 మొక్కలు

13-08-2026 12:00 AM

బోధన్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని జిల్లా ఆస్పత్రి ఆవరణను పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 20 మొక్కలను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ ప్రవీణ్ ఈ మొక్కలను ఆస్పత్రి ఆవరణకు తీసుకువచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటడం ద్వారా రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బందికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

మొక్కలు పెరిగిన తర్వాత ఆస్పత్రి పరిసరాల్లో నీడ, స్వచ్ఛమైన గాలి అందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను సంబంధిత సిబ్బంది తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడంలో మున్సిపాలిటీ చేపట్టిన ఈ చర్య అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంటైజర్ సూపర్వైజర్లు వాచ్మెన్ పాల్గొన్నారు.