2 May, 2026 | 7:49 PM

ముగ్గురు కవుల సప్తతి సభలు

10-02-2025 12:00 AM

తెలంగాణ రచయితల సంఘం (జంట నగరాలు), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఈనెల 16న హైదరాబాద్, రవీంద్రభారతిలో కందుకూరి శ్రీరాములు, డా. నందిని సిధారెడ్డి, డా. నాళేశ్వరం శంకరం ముగ్గురు కవుల ‘సప్తతి సభ’ జరుగుతుంది.

దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కొండపల్లి నీహారిణి,  బైస దేవదాస్, డా. మామిడి హరికృష్ణ, దేవిప్రసాద్,  బెల్లంకొండ సంపత్‌కుమార్, డా. తూర్పు మల్లారెడ్డి, కందాళై రాఘవాచార్య, డా. రూప్‌కుమార్ డబ్బీకార్,  డా. ఏనుగు నరసింహారెడ్డి, గుండెల్లి ఇస్తారి, డా. పోరెడ్డి రంగయ్య, డా. వి.శంకర్, గడ్డం సులోచన తదితరులు సమావేశంలో పాల్గొంటారని ‘తెలంగాణ రచయితల సంఘం’ (జంటనగరాలు) ప్రధాన కార్యదర్శి డా. బెల్లంకొండ సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.