రచనలకు ఆహ్వానం!
10-02-2025 12:00 AM
శ్రీలేఖ సాహితి, వరంగల్లు వారు గత సంవత్సరం మాదిరిగానే 2024 సంవత్సరానికి విశిష్టాద్వైత సాహిత్యానికి ‘చెన్నమనేని రంగనాయకమ్మ గారి స్మారక సాహిత్య పురస్కారం’ ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ పురస్కారం విశిష్టాద్వైత సాహిత్య గ్రంథాలకు మాత్రమే. అనువాదాలు పరిశీలించబడవు.
పద్యకావ్యాలు, వ్యాస సంపుటాలు పంపవచ్చు. రచనలు 2020 సంవత్సరాల్లో ప్రచురితమై ఉండాలి. పరిశీలన నిమిత్తం నాలుగు ప్రతులు పంపాలి. ఆఖరు తేది: 31 మార్చి 2025. ఏప్రిల్‌లో(ఉగాదికి) పురస్కారం కింద రూ.5000/-, శాలువా, మెమెంటోతో సత్కరిస్తారు.
పుస్తకాలు పంపవలసిన చిరునామా: డా. టి. శ్రీరంగస్వామి, అధ్యక్షులు, శ్రీలేఖ సాహితి, ఇం.నం. 27 లిటిల్ సోల్జర్స్ స్కూల్ లేన్, మండల కార్యాలయం ఎదురుగా, హసన్‌పర్తి హన్మకొండ. ఫోన్: 99498 57955 -






