calender_icon.png 16 November, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలు సరస్వతి శిశు మందిరాలు

16-11-2025 07:42:05 PM

విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి..

మందమర్రి (విజయక్రాంతి): భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు అని వాటిని పరిరక్షించేవి శ్రీ సరస్వతి శిశు మందిరాలు అని విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన 1972–2012 వరకు చదువుకున్న విద్యార్థుల ఐదు దశాబ్దాల ఆత్మీయ మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందిచేవి శిశుమందిరాలని, విద్యార్థుల్లో ఆత్మీయత, మర్యాద, గౌరవం, మంచి ఆచారాలను పిల్లలకు  నేర్పించడం శిశు మందిరాలతోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థుల్లో దేశ భక్తి భావాన్ని పెంపొందించి వారిని సమాజంలో మంచి వ్యక్తులుగా, సమాజానికి ఉపయోగకరులుగా తీర్చిదిద్దడంలో శిశు మంది రాల పాత్ర కీలకమన్నారు. వింత పోకడలు పోతున్న ప్రస్తుత సమాజంలో భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందాలంటే శిశు మందిర్ లాంటి విద్యాపీఠంలు అవసరం అని అన్నారు. దేశభక్తులు, దైవ భక్తులు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి నిర్మాణం జరగాలని అన్నారు. ఢిల్లీ బాంబులతో సావాసం చేస్తూ ఉగ్రవాద భావజాలంతో తీవ్రవాదులుగా తీర్చిదిద్దే చదువులు, అలాంటి వ్యక్తులు మనకు వద్దని, శాంతి మయ విద్యను, సంసృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడం సరస్వతి శిశు మందిరం పాఠశాల విధానం అని స్పష్టం చేశారు.

5 దశాబ్దాల ఆత్మీయ మహా సమ్మేళన మహోత్సవంను పురస్కరించుకొని  వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార, ఉపాధి రీత్యా  స్థిరపడిన బాల్య మిత్రులందరూ ఒకచోట  కలుసుకొని పరస్పరం ఆలింగణం చేసుకుని, యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని, చిన్ననాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విద్యాబుద్దులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఆనాటి ఆచార్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి అతిధులుగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, విశిష్ట అతిథులుగా తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి పతక మూరి శ్రీనివాసరావు, విభాగ్ అధ్యక్షులు డాక్టర్ కె విష్ణువర్ధన్ రావు, పూర్వ విద్యార్థులు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిఎంఎస్) సుంకి రత్నాకర్, పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులు రాజిరెడ్డి, గుండం అశోక్ కుమార్, విభాగ్ కార్యదర్శి దహేగాం గోవింద రావు, జిల్లా కార్యదర్శి సూరం లక్ష్మీనారాయణ, పాఠశాల అధ్యక్షులు బండారు సూరిబాబు, కార్యదర్శి దాసరి రాములు, మంచిర్యాల విభాగ్ అకాడమిక్ ఇన్చార్జి పూదారి సత్యనారాయణ, పూర్వ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.