16-11-2025 07:36:46 PM
కుమ్రం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిఢవిల్లడానికి, భావితరాలకు దారులు చూపే విజ్ఞాన బాండగారాలు గ్రంథాలయాలు అని విశ్రాంత పరీక్షల సహాయ కమిషనర్ మర్యాల ఉదయ్ బాబు అన్నారు. 58వ గ్రంధాలయా వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జిల్లా గ్రంధాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం, వ్యాస రచన పోటీలు కార్యక్రమనికి ముఖ్యఅధితిగా పాల్గొని ప్రసంగిస్తూ పుస్తక పఠనంతో మేధా శక్తిని విజ్ఞానాన్ని పెంపొందించవచ్చని, విద్యార్థులు విద్యార్థి దశనుంచే పుస్తక పఠనం చేయాలని అన్నారు. కానీ నేటి విద్యార్థులు యువకులు సెల్ ఫొన్ మోజులో పుస్తకాన్ని విస్మరిస్తున్నారు. పూర్వకాలంలో ఎందరో మహనీయులు తాళపత్ర గ్రంధాలు చదివి అపార విజ్ఞానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు,
పుస్తకాలు అందజేత
జన్కపూర్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు ధర్మపురి వెంకటేశ్వర్లు రచించిన వాసుధా శతకము పద్య కవిత్వ పుస్తకం, ఆయన ప్రోత్సహించిన 24మంది జన్కపూర్ పాఠశాల విద్యార్థులచే రచింపబడిన యంగ్ మైండ్స్ టైంలెస్ టేల్స్ ఆనే ఆంగ్ల కధలను పుస్తకాలను గ్రంధాలయ అధికారులకు అందచేశారు. వ్యాసరచన పోటీలకు న్యాయ నిర్ణీతలుగా ధర్మపురి వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్ లు వ్యవహరించారు, కవి సమ్మేళనంలో ఆసిఫాబాద్ కవులు గుర్రాల వెంకటేశ్వర్లు, ధర్మపురి వెంకటేశ్వర్లు, చిలుకూరి రాధాకృష్ణ చారి, కిల్లి వెంకటరావ్ ,ఎల్ముల ప్రశాంత్, మాసాదే నాగోరావ్ ,జాడి పెంటయ్య ,మహమ్మద్, ఇషాక్ హుస్సేన్ ,తాటిపల్లి జ్యోతి భోగ స్వప్న ,వీరపనేని త్రివేణి ల. కవిత పాఠనలు ఆహుతులను అలరించాయి.ఈ కార్యక్రమంలో గ్రంధాలయధికారులు కుర్సెంగ ప్రవీణ ,యం స్వర్ణలత ,టి సదానందం ,రికార్డ్ అసిస్టెంట్ జి సతీదేవి ,సిబ్బంది సలీం, రామయ్య ,గోపి, పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.