31-10-2025 01:39:35 PM
 
							జయంతి సందర్భంగా 2కె రన్ లో ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): సర్ధార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుండి మినీ ట్యాంక్‌బండ్ వరకు సుమారు 2కె దూరంలో రన్ సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత పటిష్ఠంగా నిలవాలంటే ప్రతి పౌరుడు సర్ధార్ పటేల్ చూపిన మార్గంలో నడవాలన్నారు. ఐక్యతలోనే శక్తి ఉందని ఆయన తన జీవితంతో నిరూపించారని తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, క్రీడాకారులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని మార్మోగించారు.