calender_icon.png 1 November, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా టేకు దుంగల పట్టివేత..

31-10-2025 07:27:01 PM

రూ. 4 లక్షల కలప స్వాధీనం

వెంకటాపురం(నూగూరు): మండల పరిధిలోని ఆలుబాక అటవీ సెక్షన్ కొత్త గుంపు బీట్ పరిధిలో గురువారం రాత్రి 17 టేకు దుంగలను పట్టుకున్నట్లు వెంకటాపురం అటవీ రేంజ్ అధికారి వంశీ తెలిపారు. చత్తీస్గడ్ సరిహద్దుల గుండా ఈ ప్రాంతంలో టేకు కలప అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు అటవీ సిబ్బందితో దాడులు నిర్వహించగా రూ.నాలుగు లక్షల విలువైన 17 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలోని అడవుల నుండి కొందరు స్మగ్లర్లు చెట్లను నరికి టేకు కలపను ఈ ప్రాంతంలో నిల్వ ఉంచి ఇక్కడ నుండి వరంగల్, భూపాల్ పల్లి, హైదరాబాద్ ప్రాంతాలకు దుంగలను సరఫరా చేస్తునట్లు తెలిపారు. వెంకటాపురం అటవీ రేంజి సిబ్బందితోపాటు బేస్ క్యాంపు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. పట్టుకున్న టేకు దుంగలను అటవీ రేంజ్ అధికారి కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.