calender_icon.png 1 November, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి విరమణ చేసిన శంకర్ కు ఘనంగా సన్మానం

31-10-2025 07:17:35 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): 40 ఏళ్ల సుదీర్ఘ కాలం ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన కాసిపేట 1 గని లో హాలర్ ఆపరేటర్ గా విధులు నిర్వహించిన జాడి శంకర్ ను యాజమాన్యం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. శంకర్ 23 ఏళ్లు కాసిపేట గనిలో  కోల్ ఫిల్లర్ గా, హాలర్ ఆపరేటర్  గా పని చేశారు. గని పిట్ కమిటీ ఏఐటీయూసీ గుర్తింపు సంఘం క్రియాశీలక సభ్యుని గా పని చేశారు.వారిని మేనేజర్ సతీష్  గారు శాలువా, జ్ఞాపికను అందచేసి సన్మానించారు.

అనంతరం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్. INTUC కేంద్ర ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్, కార్యవర్గ సభ్యులు సమ్మయ్య, పిట్ సెక్రెటరీ కన్నయ్య, రాజన్న, టి బి జి కె ఎస్ పిట్ సెక్రెటరీ బైరి శంకర్, ఉద్యోగ సంఘాలు, మండల కాంగ్రేస్ నాయకులు, మాజీ వైస్ ఎం పి పి పుస్కురి విక్రమ్ రావ్, మాజీ సర్పంచ్ ఉత్తురి సత్తయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాష్ దేవ్ సన్మానించారు.

అనంతరం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ జాడి శంకర్ మంచికి మారుపేరని, సమస్యను పరిష్కరించడంలో ముందుంటారని ,ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా రక్షణతో విధులు నిర్వహించారని, పనిని దైవంగా భావించి పని చేశారని అన్నారు. మేనేజర్ సతీష్ మాట్లాడుతూ కంపెనీకి ఉద్యోగులకు వారధిగా  మంచి సంబంధాలు కొనసాగించారని వారు ఉత్పత్తి, రక్షణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించారని అన్నారు.