31-10-2025 06:51:25 PM
 
							బెల్లంపల్లి,(విజయక్రాంతి): భారత తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం సబ్ డివిజన్ పోలీసులు ఏక్తా దివస్ లో భాగంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాత బస్టాండు నుండి కాంటా వరకు యూనిటీ రన్ ను నిర్వహించారు. తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుండి పెరిక పల్లి క్రాస్ వరకు రన్ నిర్వహించారు.
ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ నుండి ఏసీపి రవికుమార్, రూరల్ సీఐ హనూక్ ఆధ్వర్యంలో క్రీడాకారులతో కలిసి 2కె నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఔన్నత్యాన్ని, దృఢ సంకల్పాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఏసిపి రవికుమార్ యువతకు సూచించారు. భారతదేశాన్ని ఏకతాటిపై నిలిపిన ఘనత వల్లభాయ్ పటేల్ కే దక్కుతుందని అన్నారు. సమాజంలో శాంతి, సహకారాలను నెలకొల్పే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. యువత ఉక్కు సంకల్పంతో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. రన్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఏసిపి రవికుమార్ శాలువా కప్పి సన్మానించారు.