31-10-2025 07:20:31 PM
 
							వలిగొండ,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వెంటనే వీడాలని తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ ఉన్నారు. అకాల వర్షానికి వలిగొండ మార్కెట్లో ధాన్యం కొట్టుకుపోయి నష్టపోయిన రైతులందరికీ వెంటనే ప్రభుత్వం ఆర్థిక సహకారం చేయాలని, గతంలో కౌలు రైతు తమ పంటలు అమ్ముకున్నప్పుడు భూ యజమాని పాస్ పుస్తకాలు ఇస్తే సరిపోయేదని నేడు వారితో తమకు కౌలుకు ఇచ్చినట్లు ధ్రువీకరణ తీసుకురావాలనడం రైతుకు మరియు కౌలు రైతుకు మధ్యన తగాదాలు ఏర్పరచడమేనని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొట్టుకుపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.