31-10-2025 07:06:36 PM
 
							మఠంపల్లి: భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 41వ వర్ధంతిని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మఠంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ ఐక్యతకు సమగ్రతకు పేదరిక నిర్మూలనకు గరీబీ హటావో అనే నినాదంతో గరీబుల గుండెల్లో చెరగని జ్ఞాపకం ధీరత్వంలో తిరుగులేని ప్రజా నేత దివంగత ఇందిరాగాంధీ అని ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు.