31-10-2025 07:09:51 PM
 
							కల్వకుర్తి, వెల్దండ సీఐలు నాగార్జున, విష్ణు వర్ధన్ రెడ్డి
కల్వకుర్తి టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని కల్వకుర్తి, వెల్దండ సిఐలు నాగార్జున విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ 2km రన్ కల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతదేశాన్ని ఐక్యతగా ఉంచేందుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన 2కే రన్ లో కల్వకుర్తి స్పోర్ట్స్ క్లబ్, యూత్ క్లబ్స్ ,మానవతా ఫౌండేషన్, మిత్ర ఫౌండేషన్, మార్నింగ్ వాకర్స్ సభ్యులు, పుర ప్రముఖులు, కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎస్ఐలు మాధవ రెడ్డి, కురుమూర్తి, శంషాద్దీన్, మహేష్ గౌడ్, ఇతర పోలీసు సిబ్బంది, కల్వకుర్తి పట్టణ వాసులు తదితరులు పాల్గొన్నారు.