31-10-2025 07:23:28 PM
 
							నిర్మల్,(విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ ఏఐటియుసి మద్దెన భోజన కార్మిక సంఘం మాధురిలో శనివారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. భోజన కార్మికులకు బిల్లులు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుక్క రమేష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.