calender_icon.png 1 November, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాచకొండ సీపీ ఘన నివాళి

31-10-2025 07:13:43 PM

నేరెడ్మెట్,(విజయక్రాంతి): సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి రాష్ట్రీయ ఐక్యత దినోత్సవంను పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఐపీఎస్ శుక్రవారం నేరెడ్ మెట్ రాచకొండ పోలీసు కార్యాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి పోలీసు సిబ్బందితో కలిసి ‘ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ’ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... సర్ధార్ వల్లభాయ్ పటేల్ గొప్ప నాయకత్వ లక్ష్యాలు కలిగిన మహానుభావుడు అని, స్వాతంత్ర్యం అనంతరం 565 సంస్థానాలను ఐక్యపరచి “ఐక్య భారతదేశం”ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రతకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కోనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ ఎస్బీ జి. నరసింహ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.