15-12-2025 02:10:11 AM
126 ఓట్ల మెజార్టీతో వెంకట్రామిరెడ్డి గెలుపు
రామాయంపేట, డిసెంబర్ 14: రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఇలాఖాలో షాక్ తగిలింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి స్వగ్రామమైన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి బరిలో ఉండగా బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి గుడిసెల దివాకర్ బరిలో ఉన్నారు. వెంకట్రామిరెడ్డికి 572 ఓట్లు పోలవగా, దివాకర్‌కు 436 ఓట్లు పోలయ్యాయి. 126 ఓట్ల మెజార్టీతో వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు.