calender_icon.png 19 February, 2026 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్

19-02-2026 12:32:32 AM

అశ్వాపురం, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రామచంద్రాపురం గ్రామపంచాయతీలో ఉన్న పలు సమస్యలు, అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ బూరెడ్డి స్వాతి వెంకటరెడ్డి బుధవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును స్థానిక నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీకి ప్రహరీ గోడ, అంగన్వాడి భవనం, ఐకేపీ భవనం, గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ప్రజలకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో గ్రామానికి ఎక్కువ ఇళ్లు కేటాయించాలని కోరారు.

ఇంకా గ్రామంలోని పలు ఇతర సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి రామచంద్రాపురం గ్రామపంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సామ శ్రీనివాస్ రెడ్డి, మొగిళ్ల పెద్ద వీరారెడ్డి, ఏనుగు కృష్ణారెడ్డి, సామ కృష్ణారెడ్డి, మాదిరెడ్డి వెంకటరెడ్డి, కొమ్ము భద్రయ్య, చుంచు యాకాంబరం, మిట్టకంటి శ్రీనివాస్ రెడ్డి, తోట మల్లయ్య, బానోత్ కృష్ణ, చుంచు శ్రీను తదితరులు పాల్గొన్నారు.