15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎస్పీ రోహిత్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పోతిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి

19-02-2026 12:33 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి18, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ను లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మండలంలో పారిశ్రామిక వాడలుగా పేరుగాంచిన సారపాక,లక్ష్మీపురం ప్రాంతాలలో పెరుగుతున్న వ్యాపార, వాణిజ్య, రవాణా, అధిక జనాభా దృష్ట్యా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు.

సారపాక, గాంధీనగర్ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ, అసాంఘిక ఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మాక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని, సమాజ బాధ్యతగా స్థానికులుగా తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు.ఈ మేరకు ఎస్పీ రోహిత్ రాజ్ స్పందించి జిల్లా పోలీస్ వ్యవస్థ నుండి ప్రజావసరాలకు అనుగుణంగా పటిష్టమైన చర్యలు చేపడతామని చెప్పినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ నాయకులు ఇంగువ రమేష్, ఆదర్శ రైతులు యారం లక్ష్మీరెడ్డి,మేడిపల్లి ఉదయ్ పాల్గొన్నారు.