14-01-2026 12:00:00 AM
ఎర్రుపాలెం జనవరి 13 ( విజయ క్రాంతి): కేశిరెడ్డిపల్లి గ్రామానికి త్రాగునీటి సౌకర్యం కల్పించారు. దీర్ఘకాలికంగా త్రాగునీటి సౌకర్యం లేకుండా కేశరెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు కు గురైనారు. కేసిరెడ్డిపల్లి గ్రామ ప్రజల దాహార్తిని నూతన సర్పంచిగా ఎన్నికైన నండ్రు అశ్విని నెరవేర్చారు.నూతన సర్పంచిగా ఎన్నికైన నండ్రు అశ్విని, ఉప సర్పంచ్ ఎస్కే శభాష్, పాలకమండలి సభ్యులు గత నాలుగైదు రోజుల నుండి ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ దగ్గరలోని వాటర్ ట్యాంకు నుండి వెళ్లే పైపులైన్లకు మరమ్మత్తులు చేసి శాశ్వతంగా త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. దీనితో కేస్ రెడ్డి పల్లి గ్రామ ప్రజలు తమ గ్రామానికి ఎన్నో సంవత్సరాల నుండి త్రాగునీటి సౌకర్యం లేకుండా పలు ఇబ్బందులకు గురైనారు.
నూతన సర్పంచిగా ఎన్నికైన నండ్రు అశ్విని, ఉపసర్పంచ్ ఎస్ కే శభాష్ నీటి సమస్యను పరిష్కార మార్గాన్ని చూపించారు. దీనికి కేస్ రెడ్డి పల్లి గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. . తమ గ్రామానికి శాశ్వత పరిష్కారాన్ని చూపించి త్రాగు నీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మండల కేంద్రంలోని సెంటెన్స్ స్కూల్ దగ్గర, పలు ప్రాంతాలలోని పేరుకుపోయిన చెట్లను, మురుగునీటి కాలువలను శుభ్రం చేస్తూ ఎర్రుపాలెం గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా ఉంచడానికి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, గ్రామ ప్రజలందరూ తమకు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు.