13-01-2026 11:45:29 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చైనా మాంజా అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బెల్లంపల్లి వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కే. శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం.. బెల్లంపల్లి పట్టణంలో పలు దుకాణాలో చైనా మంజా విక్రయిస్తున్నట్టు సమాచారం మేరకు సోదా చేశారు. ఈ సోదాలో పోస్టాఫీస్ బస్తీలో వెంగళ విజయ వద్ద 5 చైనా మాంజా చుట్టలు, వెంగళ రాజమల్లు వద్ద 3 చైనా మాంజా చుట్టలు, 60 చైనా మాంజా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకునీ దర్యాప్తు చేస్తున్నారు.