calender_icon.png 23 December, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నట్టల నివారణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సంతోష్ యాదవ్

23-12-2025 03:04:41 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): నట్టల నివారణ శిబిరాన్ని యరగండ్లపల్లి గ్రామ సర్పంచి వల్లముల సంతోష్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. సందర్భంలో సర్పంచ్ మాట్లాడుతూ... గొర్రెలు మేకలను నట్టల నుండి కాపాడుకోవడానికి పశు వైద్య శాఖ అధికారులు అందజేస్తున్న వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులను కోరారు. ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి ఒక్కరూ అధికారుల సూచనల మేరకు మేకల గొర్రెలను నట్టల బారి నుండి వైద్య చికిత్సలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్, అసిస్టెంట్ ఎల్లేశా, అందుగుల శ్రీనివాస్, వనపర్తి నరసింహ, చామకూర ముత్యాలు, కొమరయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.