23-12-2025 03:46:42 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్మల్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దీక్షలో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం పాలకులు ఇండ్ల స్థలాలను వెంటనే కేటాయించాలని ఎన్నోసార్లుగా వినతిపత్రం ఇచ్చినప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఆందోళన ప్రారంభించడం జరిగిందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రసం శ్రీధర్ భూస లక్ష్మీనారాయణ తెలిపారు. మొదటి రోజు ధర్నాలు 100 మంది పాత్రికేయులు పాల్గొనగా ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు పలికి సంఘీభావం తెలిపారు