23-12-2025 03:01:03 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాన్ని మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందించడమే మీ సేవ కేంద్రాల లక్ష్యమని ఆయన తెలిపారు. ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, జనన–మరణ ధృవీకరణ పత్రాలు, పింఛన్లు, వివిధ ప్రభుత్వ పథకాల దరఖాస్తులు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ మీ సేవ కేంద్రం ద్వారా నకిరేకల్ పట్టణ ప్రజలు అనేక సేవలను సకాలంలో పొందగలరని, సమయం, ఖర్చు ఆదా అవుతాయని అన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.