23-12-2025 03:49:34 PM
హుజూర్ నగర్: ప్రమాదవశాత్తు లారీపై నుండి జారిపడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న సాయిరమణ రైస్ పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో లారీలో వరి పొట్టును నింపుతుండగా లారీ పైనుంచి కిందపడి ఒక కార్మికుడు మృతి చెందారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన రాజు కుమార్ దాస్ (26)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.