10-02-2026 06:33:34 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): సర్పంచ్ అంటే పదవి అనే వ్యామోహంలో ఉండే ఈ రోజుల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది అనారోగ్యానికి గురి కావడంతో గ్రామ సర్పంచ్ స్వయంగా చెత్త ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలో చెత్తను సేకరించిన సంఘటన మహమ్మద్ నగర్ మండలంలోని గునుకుల్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామ పంచాయతీలో రాక నడిపే వ్యక్తికి అనారోగ్యానికి గురి కావడంతో గ్రామ సర్పంచ్ గంగి రమేష్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ చెత్తను సేకరించారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామ పరిశుభ్రతకు కృషి చేస్తున్న సర్పంచ్ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. పదవిలోకి రాగానే తమ దర్పణాన్ని ప్రదర్శించే ఈ రోజుల్లో సామాన్య వ్యక్తుల చెత్తను సేకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.